Random Video

Chandrababu Naidu Playing Dramas Over Polavaram Project | Oneindia Telugu

2017-12-02 713 Dailymotion

YSRCP MP YV Subbareddy criticises AP CM Chandrababu Naidu over Polavaram Project issue. He said Naidu playing dramas with project.

ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై పెద్ద వివాదమే రేగుతోంది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తుందన్న తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మంటపుట్టించింది.
సీఎం వ్యాఖ్యలకు బీజేపీ నుంచి కౌంటర్స్ రావడం.. టీడీపీ నేతలు వాటిని తిప్పికొట్టడంతో వివాదం మరింత పెరిగింది. ఇదిలాగే కొనసాగితే రెండు పార్టీల మధ్య అగాథం టీడీపీకే దెబ్బ కాబట్టి తమ పార్టీ నేతలను సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వైఖరి చర్చనీయాంశంగా మారింది. పోలవరం విషయంలో బీజేపీని తొలుత ఆయనే టార్గెట్ చేసి ఇప్పుడు పార్టీ నేతలను మాత్రం సంయమనం పాటించాలని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలవరంపై వివాదం ముదురుతున్న తరుణంలో అటు వైసీపీ నేతలు కూడా కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.